‘పుష్ప 3’.. మరో మూడేళ్లలో
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:42 AM
అల్లుఅర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2: ద రూల్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి...
అల్లుఅర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2: ద రూల్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప 3: ద ర్యాంపేజ్’ ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే ప్రకటించారు. ‘రాబిన్‌హుడ్’ ప్రెస్‌మీట్‌లో ‘పుష్ప 3’ గురించి నిర్మాత వై. రవిశంకర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘‘పుష్ప 3’ని 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అల్లు అర్జున్ ప్రస్తుతం తను చేయబోయే ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.