ఎప్పటికీ నా మనసులో ఉండిపోయే సినిమా

ABN , Publish Date - Apr 21 , 2025 | 02:07 AM

‘‘ఆ పరమశివుడి స్ఫూర్తితోనే ‘ఓదెల 2’ సినిమా కథ పుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ అనుకున్నాక నిర్మాత మధు ఏ దశలోనూ వెనుకంజ వేయలేదు. విడుదలకు ముందే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఎప్పటికీ నా మనసులో...

‘‘ఆ పరమశివుడి స్ఫూర్తితోనే ‘ఓదెల 2’ సినిమా కథ పుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ అనుకున్నాక నిర్మాత మధు ఏ దశలోనూ వెనుకంజ వేయలేదు. విడుదలకు ముందే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఎప్పటికీ నా మనసులో ఉండిపోయే సినిమా ఇది’’ అని సంపత్‌ నంది అన్నారు. తమన్నా, హెబ్బా పటేల్‌, వశిష్ట.ఎన్‌.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ఈ సినిమా హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు అశోక్‌ తేజ మాట్లాడుతూ ‘‘మా సినిమా కలెక్షన్స్‌ రోజురోజుకూ పెరుగుతుండటం ఆనందాన్నిస్తోంది. ఇది అందరికోసం తీసిన సినిమా’’ అని చెప్పారు. నిర్మాత మధు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ద్వారా నా లైఫ్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. చాలా మంది ఈ సినిమాకు నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చారు. విమర్శకుల అభిప్రాయాల కంటే ప్రేక్షకుల ఆదరణే మాకు ముఖ్యం. ప్రేక్షకులు ఈ సినిమాను గెలిపించారు’’ అని తెలిపారు.

Updated Date - Apr 21 , 2025 | 02:07 AM