నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:55 AM
‘ఎల్2:ఎంపురాన్’ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై చిత్ర కథానాయకుడు మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు...
పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక
‘ఎల్2:ఎంపురాన్’ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై చిత్ర కథానాయకుడు మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘ఎల్2:ఎంపురాన్’ తెర వెనుక ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. పృథ్వీరాజ్ సుకుమారన్‌ను అన్యాయంగా నిందిస్తున్నారు. తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాటిని చూసి ఓ తల్లిగా ఆవేదన చెందుతున్నా. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందరి ఆమోదంతోనే చిత్రం తెరకెక్కింది. కానీ సినిమా విడుదలయ్యాక పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతాడు’ అని ప్రశ్నించారు.