Poorna Chandrarao: ‘పోర్న్' చంద్రరావు’ కథేంటి
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:38 PM
తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే అవుతుంది. అలాంటి ఓ కొత్త ప్రయోగమే ‘పూర్ణ చంద్రరావు’ (Poorna chandrarao).
తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే అవుతుంది. అలాంటి ఓ కొత్త ప్రయోగమే ‘పూర్ణ చంద్రరావు’ (Poorna chandrarao). ఇండియన్ సినిమాలో తొలిసారి పోర్న్ అడిక్షన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎత్తిచూపిస్తూ వస్తున్న ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ‘ఏం చేస్తునావ్’తో నటుడిగా పరిచయమైన విజయ్ రాజ్‌కుమార్ ‘పూర్ణ చంద్రరావు’లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రైటర్ కూడా ఆయనే. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సోఫా మీద అర్థనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో, వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు సందేశం ఇస్తున్నట్లుగా ఉంది. టెక్నాలజీ, పోర్న్ అడిక్షన్, మానసిక స్థితిలకు సంబంధించినట్లుగా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.
‘అనగనగా ఆస్ట్రేలియాలో’ సినిమాతో కొత్తగా ట్రై చేసిన తారక రామ, ఇప్పుడు మరింత బోల్డ్ కథను ఎంచుకున్నారు. హీరో తన సొంత అనుభవాలు ఆధారంగా చేసుకుని ఈ కథ రాశారట. ఈ సినిమా పోస్టర్ చూసిన వారంతా ుూఇది చాలా మందికి అవసరమైన కథ’ అని కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇటువంటి ప్రయోగాలు చాలా అరుదు’’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. సహాన ఆర్ట్ క్రియేషన్స్‌పై మాధవి మంగపతి, యారీక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.