Pooja Hegde: పట్టించుకోవడం లేదంటున్న పూజా బేబీ...

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:45 PM

కొన్నేళ్ళుగా సినిమా రంగంలో ఉంటున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తనకూ సినిమా కష్టాలు తప్పలేదని వాపోతోంది.

టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం భాషా భేదం లేకుండా అగ్రహీరోలతో సినిమాలు చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ (Kollywood), బాలీవుడ్ (Bollywood) లో వరుస ఛాన్స్ లు అందుకుంటూ స్టార్ ఇమేజ్ ను మరింత పెంచుకుంటుందీ డస్కీ బ్యూటీ. అయితే ఈ మధ్య సినిమా ఛాన్స్ లతో పాటు షాకింగ్ కామెంట్స్ తో సెన్సేషన్ గా మారుతోంది. తాజాగా జిగేల్ రాణి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో స్టార్ హీరోల‌తో పాటు టైర్ 2 హీరోలతో ఛాన్స్ లు కొట్టేసింది. అయితే తాజాగా నీలాంబరి చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికి తాను కూడా వివక్షతను ఎదుర్కొన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. కో-స్టార్స్ వల్ల ఇబ్బందులు పడ్డారా? అని అడిగిన క్వశ్చన్ కు బ్యూటీ చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. పైగా హీరో హీరోయిన్లకు చూపించే తేడా గురించి చెప్పేసింది.


ఇండస్ట్రీలో హీరోయిన్ల పై ఓ రకమైన చిన్న చూపు ఉంటుందని, కనీసం పోస్టర్లలో కూడా వారి పేర్లు వేయరని చెప్పుకొచ్చింది. ఇక షూటింగ్ సెట్ లో హీరోలకు కారవాన్ పక్కనే ఇస్తారు. అదే హీరోయిన్లకు ఎక్కడో దూరంగా ఇస్తారు. దాని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఒక్కోసారి హెవీ డ్రెస్ వేసుకుని సెట్ వరకు నడవాల్సి వస్తుందని, మళ్లీ షాట్ కంప్లీట్ అయిన తర్వాత కారవాన్ వరకు వెళ్లాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది పూజా హెగ్డే. ఇవే కాక కెరీర్ లో తన ఎదుర్కొన్న ఇబ్బందులనూ చెప్పుకొచ్చింది. కొందరు కావాలని తనపై తప్పుడు కథనాలు ప్రచురించారని, తన ఎదుగులను చూసి ఓర్వలేక ట్రోలింగ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పొడుగు కాళ్ళ సుందరి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

Also Read: NATS: ఘనంగా 8వ తెలుగు సంబరాలు కర్టెన్ రైజర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 22 , 2025 | 06:45 PM