Priyanka Chopra: నిజంగానే... అపురూపం

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:27 PM

ప్రియాంక చోప్రా ఇవాళ యూనివర్సల్ స్టార్. చిత్రం ఏమంటే... నటిగా ఆమె కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలైంది. ఇంతకాలానికి ఆమె మరోసారి తెలుగు మూవీలో నటిస్తోంది.

ఆల్ ఇండియాలోనే కాదు, హాలీవుడ్ లోనూ అదరహో అనిపిస్తోన్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన తొలిచిత్రం అపురూపం (Apuroopam). ఇది తెలుగు సినిమానే. కానీ, ఇప్పటి దాకా విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాతే తమిళ చిత్రం తమిళన్ లో విజయ్ (Vijay) సరసన నటించి తొలిసారి తెరపై కనిపించింది ప్రియాంక. ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో మహేశ్ బాబు (Maheshbabu) సరసన నటిస్తోంది ప్రియాంక. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ప్రియాంకకు ఉన్న ఫాలోయింగ్, మరోవైపు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న రాజమౌళి, ఆ పై టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన మహేశ్ వీరి కాంబోలో వస్తోన్న మూవీపై విశేషమైన క్రేజ్ నెలకొనడం సహజమే... ఈ నేపథ్యంలోనైనా ప్రియాంక తొలి చిత్రం అపురూపం వెలుగు చూస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిలాష.

Also Read: Friday Movies: ఈ వారం ఆరు వైవిధ్యమైన చిత్రాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2025 | 04:27 PM