కడుపుబ్బా నవ్వించే చిత్రం

ABN , Publish Date - Mar 20 , 2025 | 02:32 AM

సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం పెళ్లికాని ప్రసాద్‌. అభిలా్‌షరెడ్డి గోపిడి దర్శకత్వంలో కె.వై.బాబు, భానుప్రకాష్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్‌, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మించారు...

సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్‌’. అభిలా్‌షరెడ్డి గోపిడి దర్శకత్వంలో కె.వై.బాబు, భానుప్రకాష్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్‌, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మించారు. దిల్‌రాజు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సినిమాను విడుదల చేస్తోంది. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సప్తగిరి. ‘‘దర్శకుడు అభిలాష్‌ ఈ కథ చెప్పేటప్పుడే సినిమా విజయంపై పూర్తి నమ్మకం వచ్చేసింది. అందరినీ కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ఎక్కడా బోర్‌ కొట్టదు. దర్శకుడు అభిలాష్‌ రాసిన సంభాషణలు, వినోదాత్మక సన్నివేశాలు, శేఖర్‌ చంద్ర అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధానాకర్షణ. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 20 , 2025 | 02:32 AM