ధర్మం కోసం యుద్ధం
ABN , Publish Date - Mar 31 , 2025 | 02:20 AM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా చారిత్రక నేపథ్యంలో కాల్పనిక గాథగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇందులో పవన్ కల్యాణ్ పోరాట యోధుడిగా అలరించనున్నారు...
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా చారిత్రక నేపథ్యంలో కాల్పనిక గాథగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇందులో పవన్ కల్యాణ్ పోరాట యోధుడిగా అలరించనున్నారు. ఉగాది సందర్భంగా చిత్రబృందం పవన్ కల్యాణ్ కొత్త లుక్‌ను విడుదల చేసింది. ఎరుపు రంగు దుస్తులు ధరించి, ఓ చేతిలో పిడిబాకు, మరో చేతిలో చిన్న కడియం పట్టుకొని పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ‘ధర్మం కోసం యుద్ధం. హరిహర వీరమల్లు సాహస గాథను చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అని ఈ సందర్భంగా మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ. దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మే 9న తొలిభాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.