పవన్‌కల్యాణ్ కరాటే గురువు షిహాన్ హుసైని కన్నుమూత
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:37 AM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన షిహాన్ హుసైని(60) మరణించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన షిహాన్ హుసైని(60) మరణించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. షిహాన్ హుసైని 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్’ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయం అయ్యారు. కాగా, షిహాన్ మరణవార్త తనను ఎంతో కలచివేసిందని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పోస్టు పెట్టారు. ‘షిహాన్ హుసైని’ తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఆయన వద్ద కరాటేలో శిక్షణ పొందాను. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల క్రితమే తెలిసింది. ఈనెల 29న చెన్నై వెళ్లి పరామర్శించాలని అనుకున్నా. ఈలోపే దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ‘తమ్ముడు’ సినిమాలో సన్నివేశాలకు ఆయన ఇచ్చిన శిక్షణే ఉపయోగపడింది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.