యువతను మెప్పించే చిత్రం

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:18 AM

సుధీశ్‌ వెంకట్‌, అంకిత జంటగా అరవింద్‌ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్యాషన్‌’. అరుణ్‌ కుమార్‌, నరసింహ నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను...

సుధీశ్‌ వెంకట్‌, అంకిత జంటగా అరవింద్‌ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్యాషన్‌’. అరుణ్‌ కుమార్‌, నరసింహ నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్యాషన్‌ నవల చదివాను. బాగా నచ్చింది. ఆ కథను అరవింద్‌ జాషువా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం కలిగింది. తన బ్యాగ్రౌండ్‌ అయిన ఫ్యాషన్‌ టెక్నాలజీ నేపథ్యంలో సినిమా తీయడం అభినందించాల్సిన విషయం’ అని అన్నారు. చిత్ర దర్శకుడు అరవింద్‌ జాషువా మాట్లాడుతూ ‘సెలబ్రిటీలు, వీఐపీల పిల్లలు చదివే ‘నిఫ్ట్‌’ కాలేజీలో ఒక మామూలు పిల్లాడు చేరితే ఎలాంటి కష్టాలు ఎదురవుతాయనేది ఈ చిత్ర కథ’ అని తెలిపారు.

Updated Date - Apr 27 , 2025 | 01:18 AM