Raj Tarun New Movie: వినోదం పంచే పాంచ్‌మినార్‌

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:39 PM

రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన 'పాంచ్ మినార్' సినిమా టీజర్ విడుదలైంది. వినోదభరితంగా ఉండే ఈ చిత్రంలో రాశీ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు

రాజ్‌తరుణ్‌ హీరోగా రామ్‌ కడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాంచ్‌ మినార్‌’. మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రబృందం ఆదివారం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘దర్శకుడు గొప్ప విజన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పాడు. రామ్‌ కడుముల మాట్లాడుతూ ‘పాంచ్‌మినార్‌ అంటే ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం హాయిగా నవ్వుకునే సినిమా ఇది’ అని తెలిపారు. ‘ఇందులో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది, ప్రేక్షకులను అలరిస్తుంది’ అని కథానాయిక రాశీ సింగ్‌ చెప్పారు.

Updated Date - Apr 13 , 2025 | 11:39 PM