Oka Pathakam Prakaram: ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో చెబితే రూ. 10 వేలు మీవే..
ABN , Publish Date - Jan 21 , 2025 | 10:43 PM
చాలా గ్యాప్ తర్వాత ప్రామిసింగ్ హీరో సాయిరాం శంకర్ చేసిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను తెలియజేయడంతో పాటు.. చిన్న కాంటెస్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ అయ్యే లోపు విలన్ ఎవరో చెబితే.. స్పాట్‌లో రూ. 10 వేలు ఇస్తామంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
సాయిరాం శంకర్.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా.. ‘143’, ‘బంపర్ ఆఫర్’ వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నా.. అనుకోకుండా ఆయనకు గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఆయన నటించిన విభిన్న కథా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ ఈ గ్యాప్‌ని ఫిల్ చేస్తుందని అంటున్నారు సాయిరాం శంకర్. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిల్మ్స్ బ్యానర్‌తో పాటు.. గార్లపాటి రమేష్‌కి చెందిన విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఓ కాంటెస్ట్ పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు.
Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..
ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ... ‘‘ఒక పథకం ప్రకారం’ సినిమాలో నాది లాయర్ పాత్ర. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్‌ని. క్రిమినల్ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా? ఇలా ఈ సినిమా క్రైమ్ సస్సెన్స్‌తో ఇంటెన్సిటీ థ్రిల్లింగ్ ఇస్తుంది. ఈ సినిమాను నేను చాలా ఇష్టపడి చేశా. నాకు వచ్చిన గ్యాప్‌ని ఈ సినిమా ఫిల్ చేస్తుంది. స్క్రీన్‌ప్లే, కథ, నన్ను ప్రొజక్ట్ చేసిన విధానం అన్నీ కూడా నాకు వంద శాతం ఉపయోగపడే సినిమా. చాలా కొత్తగా ఉంటుంది. సినిమా మొదలైనప్పటి నుండి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫీల్ ఇస్తూ.. ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు అనుకోకపోతే.. నన్ను తిట్టుకోవచ్చు.. వీడు ఇంతేరా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఛాన్స్ ఈ సినిమా ఇవ్వదని నాకు తెలుసు. ఈ సినిమా కోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానేమో. నిజంగా నా వెయిటింగ్‌కి సరిపడా నాకు ఉపయోగపడే సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత అందరూ నేను జెన్యూన్‌గా చెప్పానని అనుకుంటారు. కచ్చితంగా టీమ్‌ని అభినందిస్తారు.
నిర్మాత గార్లపాటి రమేష్‌గారు, దర్శకుడు వినోద్ విజయన్, జీను భాయ్, స్వాతి గార్ల సపోర్ట్‌తో సినిమా మొదలైంది. సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే.. మళ్లీ ఇలాంటి టీమ్‌తో నేను సినిమా చేస్తానని మాత్రం చెప్పలేను. అంతగొప్ప టీమ్ కుదిరింది. రాజీవ్ రవి.. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి ఇన్ ఇండియా. టాప్ టెన్‌లో ఉండే డిఓపి.. అందుకే ఈ సినిమాకు ఇంత క్వాలిటీ వచ్చింది. కేరళలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రెండు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గోపీసుందర్. ఇలాంటి పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. వీళ్లంతా నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఆర్ట్ డైరెక్టర్, మేకప్ మ్యాన్.. ఇలా అందరూ నేషనల్ అవార్డ్ విన్నర్సే. వీళ్లందరూ ఈ సినిమాకు పనిచేయడానికి కారణం వినోద్ విజయ్. వీళ్లందరితో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. వీళ్లందరూ కలిసి నాకు ఈ ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో హిట్ ఇస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో అయితే చూసుండరు. మంచి క్వాలిటీ, మేకింగ్ సినిమాను మరోసారి చూడబోతున్నాం.
Also Read- Priyanka Chopra: చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో పూజలు.. ఉపాసనకు థ్యాంక్స్
ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో చిన్న కాంటెస్ట్ పెట్టబోతున్నాం. ఎందుకంటే, ఈ సినిమాలోనే చిన్న ప్రమోషన్ ఉంది. అదే మేము ప్రమోషన్‌గా పెట్టుకున్నాం. ‘పట్టుకుంటే పదివేలు.. ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే మీరే హీరో’ ఇదే కాంటెస్ట్. సినిమా చూస్తూ.. ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే మీకు స్పాట్‌లో పదివేలు ఇస్తారు. మీకు ఒక కూపన్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఆ కూపన్‌లో విలన్ ఎవరో చెప్పి.. సెకండాప్ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్ అయితే.. స్పాట్‌లో పదివేలు ఇస్తారు. ఇలా మొత్తం ఒక 50 సెంటర్స్‌లో మేము ఇవ్వబోతున్నాం. ఈ సినిమాపై ఇంత నమ్మకం ఎందుకంటే.. స్క్రీన్‌ప్లే అలా ఉంటుంది. క్లైమాక్స్ వరకు విలన్ ఎవరో కనిపెట్టలేరు. అంత గొప్పగా కథ, స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ సినిమాను రెడీ చేశారు. ఇదే మా సినిమాకు పబ్లిసిటి. ఫిబ్రవరి 7న ఈ సినిమా చూడండి. ఈ కాంటెస్ట్‌లో మీరూ పాల్గొనండి. 10వేలు గెలుచుకోండి’’ అని చెప్పుకొచ్చారు.