Director Sampath Nandi: కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:50 AM
తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓదెల 2' చిత్రం సీక్వెల్‌గా ఘనవిజయం సాధిస్తోంది. సంపత్ నంది మాట్లాడుతూ ఈ సినిమా రానున్న రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని పేర్కొన్నారు
సంపత్ నంది
తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్‌నంది కథను అందించి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. తాజాగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది’’ అని అన్నారు. ‘‘సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవ్వడం ఆనందంగా ఉంది’’ అని చిత్ర నిర్మాత మధు చెప్పారు.