ఆ మాటలు నన్ను కదిలించాయి
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:32 AM
ఓ జపనీస్ అభిమాని చెప్పిన మాటలకు చలించిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘దేవర’ చిత్రం నేడు జపాన్‌లో విడుదలవుతోంది...
ఓ జపనీస్ అభిమాని చెప్పిన మాటలకు చలించిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘దేవర’ చిత్రం నేడు జపాన్‌లో విడుదలవుతోంది. అక్కడ నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయుధ పూజ పాటకు ఓ అభిమానితో కలసి స్టెప్పులేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, తన జపాన్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఎన్టీఆర్. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చూసిన తరవాత తెలుగు నేర్చుకున్నానని ఓ జపనీస్ అభిమాని చెప్పడం నన్ను కదిలించింది. విభిన్న సంస్కృతులతోపాటు భాష నేర్చుకునేందుకు సినిమా దోహదపడుతున్నందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి వాటి కోసమే భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పేర్కొన్నారు.