నటనతో అదరగొట్టారు

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:42 AM

‘‘అంచనాలను మించి విజయం సాధించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రబృందానికి నా అభినందనలు. ఈ విజయం వెనుక దర్శకుడు కల్యాణ్‌శంకర్‌ కష్టం చాలా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా...

‘‘అంచనాలను మించి విజయం సాధించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రబృందానికి నా అభినందనలు. ఈ విజయం వెనుక దర్శకుడు కల్యాణ్‌శంకర్‌ కష్టం చాలా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా తమదైన నటనతో అదరగొట్టారు. కామెడీని పలికించడం కష్టమైన పని. అందుకే నేను ‘అదుర్స్‌ 2’ చేయడం లేదు. అప్పట్లోలా ఇప్పుడు నవ్వించలేనేమో అనే భయం ఉంది. కానీ ‘మ్యాడ్‌ స్క్వేర్‌’లో నార్నె నితిన్‌ కామెడీని బాగా పండించాడు’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్ర విజయోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. చిత్రబృందానికి ధన్యవాదాలు’’ అని చెప్పారు. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘నాగవంశీ లేకుంటే నేను ఉండేవాడ్ని కాదు. నిర్మాత చినబాబు లేకుంటే ‘మ్యాడ్‌’ చిత్రం ఉండేది కాదు’’ అని తెలిపారు.

Updated Date - Apr 07 , 2025 | 04:42 AM