NTR: తారక్ అతిథిగా మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ సెలబ్రేషన్స్
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:01 PM
నార్నే నితిన్ తాజా చిత్రం 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అతిథిగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. 'మ్యాడ్' సీక్వెల్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' సైతం విజయం సాధించడం విశేషం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) జపాన్ పర్యటన ముగించిన ఇండియాకు వచ్చేశారు. 'దేవర -1' (Devara -1) సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తో కలిసి జపాన్ లో సందడి చేసిన ఎన్టీఆర్ ఇండియాకు రాగానే తిరిగి తన రెగ్యులర్ పనిలో పడిపోయారు. అయితే జపాన్ లో ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ దిగిన ఫోటోస్, వీడియోస్, షోటో షూట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హిందీ మూవీ 'వార్ -2' (War -2) తో పాటు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. మరో పక్క కుటుంబ పరమైన బాధ్యతలనూ ఎంచక్కా నిర్వర్తిస్తున్నారు. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Narne Nithin) తాజాగా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) సక్సెస్ తో హ్యాట్రిక్ సాధించాడు. ఇది ఎన్టీఆర్ కు ఆనందాన్ని కలిగించే వార్తే!
2023లో నార్నే నితిన్ నటించిన 'మ్యాడ్' (Mad) మూవీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అందులో నితిన్ తో పాటు సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), రామ్ నితిన్ (Ram Nithin) హీరోలుగా నటించారు. ఇక గత యేడాది నార్నే నితిన్ సోలో హీరోగా వచ్చిన 'ఆయ్' (Aay) కూడా చక్కని విజయాన్ని అందుకుంది. ఈ యేడాది 'మ్యాడ్' సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్'తో హ్యాట్రిక్ సాధించాడు నితిన్. 'మ్యాడ్'లో సంగీత్ శోభన్ ను హీరోగా మేకర్స్ ఇన్ డైరెక్ట్ గా డిక్లైర్ చేశారు. ఆ సినిమాలోని నటనకు గానూ బెస్ట్ డెబ్యూ హీరోగా సంగీత్ శోభన్ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. అయితే ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' మూవీ క్లయిమాక్స్ లో దీనికి హీరో నార్నే నితిన్ అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్. ఏదేమైనా ఈ ముగ్గురూ కీలక పాత్రలు పోషించిన 'మ్యాడ్ స్క్వేర్' కూడా ఘన విజయాన్ని అందుకుంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ మూవీ రూ. 75 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 4న గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను నిర్మాత నాగవంశీ ప్లాన్ చేశారని, బావమరిది విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్టీఆర్ సైతం ఈ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నాడని సమాచారం. విశేషం ఏమంటే... ఎన్టీఆర్ నటించిన 'దేవర-1' సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీనే విడుదల చేశారు. పైగా ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని నాగవంశీ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలా ఈ సంస్థ నుండి విడుదలై ఈ యేడాది మంచి విజయం సాధించిన 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ భాగస్వామి కాబోతున్నాడు.
Also Read: Aamir Khan: లాపతా లేడీస్ మూవీపై నెటిజన్స్ సెటైర్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి