సూపర్‌ స్టార్‌ వద్దు... నయనతార చాలు

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:12 AM

తమిళ నటి నయనతారను అభిమానులంతా ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలిచే విషయం తెలిసిందే. అయితే, తనను ఇకపై ఇలా పిలవొద్దని అభిమానులకు ఎక్స్‌ వేదికగా...

తమిళ నటి నయనతారను అభిమానులంతా ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలిచే విషయం తెలిసిందే. అయితే, తనను ఇకపై ఇలా పిలవొద్దని అభిమానులకు ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు నయనతార. ‘‘మీరంతా నన్ను లేడీ సూపర్‌స్టార్‌ అంటూ నాపై ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. మీ ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ దయచేసి నన్ను లేడీ సూపర్‌స్టార్‌ అని పిలవకండి. నన్ను ‘నయనతార’ అని పిలవండి. ఎందుకుంటే ఆ పేరు నా హృదయానికి చేరువైనది. నటిగా, వ్యక్తిగా నన్ను ప్రతిబింబిస్తుంది’’ అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం సెంథిల్‌ నల్లసామి తెరకెక్కిస్తున్న ‘రక్కయీ’, యశ్‌ కథానాయకుడిగా గీతూమోహన్‌దా్‌స దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు నయనతార.

Updated Date - Mar 06 , 2025 | 05:12 AM