ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాం

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:48 AM

‘‘రాబిన్‌హుడ్‌’ ఫైనల్‌ కాపీ చూశాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే సంతృప్తి కలిగింది. కథ విన్నప్పుడే సినిమా పెద్ద విజయం అందుకుంటుందనే నమ్మకం కలిగింది. గతంలో నేను హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం...

‘‘రాబిన్‌హుడ్‌’ ఫైనల్‌ కాపీ చూశాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే సంతృప్తి కలిగింది. కథ విన్నప్పుడే సినిమా పెద్ద విజయం అందుకుంటుందనే నమ్మకం కలిగింది. గతంలో నేను హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ చిత్రం సూపర్‌హిట్‌ అయింది. ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం దానికి మించి ఉండబోతోంది. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాం’ అని హీరో నితిన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం మీడియా సమావేశం నిర్వహించింది. వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘సినిమా కోసం మా టీమ్‌ అంతా చాలా కష్టపడింది. తప్పకుండా ‘రాబిన్‌హుడ్‌’ ఘన విజయాన్ని అందుకుంటుంది. ప్రేక్షకులు మా సినిమాను బ్లాక్‌ బస్టర్‌ చేస్తారనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.


నిర్మాత వై. రవిశంకర్‌ మాట్లాడుతూ ‘రాబిన్‌హుడ్‌’ ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లోకి చొచ్చుకెళ్లింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి పాటలు, ఆకట్టుకునే రొమాంటిక్‌ సన్నివేశాలు, అదరగొట్టే యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ చిత్రంలో మిళితమై ఉంటాయి. సినిమా ఆధ్యంతం అలరిస్తుంది’ అని చెప్పారు.

Updated Date - Mar 27 , 2025 | 03:48 AM