Trinadha Rao Nakkina: చౌర్య పాఠం నుండి ఆడ పిశాచం సాంగ్

ABN , Publish Date - Mar 19 , 2025 | 04:59 PM

ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం 'చౌర్య పాఠం'. ఇది ఏప్రిల్ 18న జనం ముందుకు రాబోతోంది.

ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) నిర్మించిన క్రైమ్, కామెడీ డ్రామా 'చౌర్య పాఠం' (Chaurya Paatam). ఇంద్రా రామ్ (Indhra Ram) ను హీరోగా పరిచయం చేయడంతో పాటు చందు మొండేటి (Chandu Mondeti) అసోసియేట్ నిఖిల్ గొల్లమారిని కూడా డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు వి. చూడామణి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ ప్రమోషనల్ సాంగ్ వచ్చింది. దానిని నాగచైతన్య (Naga Chaitanya) విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.


తాజాగా 'చౌర్య పాఠం' మూవీ నుండి 'ఆడ పిశాచం' అనే పాటను విడుదల చేశారు. 'ఈగిల్' ఫేమ్ దావ్ జాండ్ (Davzand) సంగీతాన్ని అందించిన ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ (Baskarabatla Ravikumar) రాశారు. ఆంథోనీ దాసన్ దీనిని పాడారు. ఈ పాటకు విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చేశారు. ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కథను అందించారు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలను రాజీవ్ కనకాల, మస్త అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, సుప్రియ ఐసోలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'చౌర్యపాఠం' మూవీ ఏప్రిల్ 18న విడుదల కాబోతోంది.

Also Read: Mohan Babu: భక్తవత్సలం నాయుడు నట స్వర్ణోత్సవం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 19 , 2025 | 06:08 PM