Sumathi Shatakam Movie: సరికొత్త ప్రేమ కథ

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:49 AM

బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి హీరోగా, సైలీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న "సుమతీ శతకం" చిత్రం అమరావతిలో ప్రారంభమైంది. ఇది ఒక సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతోంది

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అమర్‌దీప్‌ చౌదరి హీరోగా, సైలీ చౌదరి హీరోయిన్‌గా నూతన దర్శకుడు ఎం.ఎం.నాయుడు తెరకెక్కిస్తోన్న సినిమా ‘సుమతీ శతకం’ సోమవారం అమరావతిలో ప్రారంభమైంది. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ క్లాప్‌ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి బండారు నాయుడు కథను అందించగా, సుభాశ్‌ ఆనంద్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

Updated Date - Apr 22 , 2025 | 03:52 AM