సెట్స్‌లో గొడవ.. ఇప్పుడంతా ఓ.కే! నయనతార
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:42 AM
నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుందర్.సి ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2) చిత్రాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020లో విడుదలై ఘనవిజయం సాధించిన మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) చిత్రానికి ఇది సీక్వెల్...
నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుందర్.సి ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2) చిత్రాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020లో విడుదలై ఘనవిజయం సాధించిన మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) చిత్రానికి ఇది సీక్వెల్. అయితే షూటింగ్ ప్రారంభించిన కొన్ని రోజులకే సెట్స్‌లో నయనతారకు, అసిస్టెంట్ డైరెక్టర్‌కు మధ్య విభేదాలు వచ్చాయట. ఒక దశలో కోపాన్ని అణుచుకోలేక నయనతార ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌పై పెద్దగా అరిచేశారట. దీంతో ఈ సమస్య సద్దుమణిగేవరకూ దర్శకుడు సుందర్ షూటింగ్‌ను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి సరిస్థితుల్లో ఇక నయనతారతో పని చేయడం కష్టమనీ, సినిమాలో ఆమెకు బదులుగా తమన్నాను తీసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన దర్శకుడు సుందర్‌కి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే చిత్ర నిర్మాత ఇషారి.కె.గణేశ్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయనీ... షూట్ కూడా తిరిగి ప్రారంభమైందని తాజా సమాచారం. ఈ సినిమా కోసం నయనతార నాన్ వెజ్ కూడా మానేసి భక్తి శ్రద్ధలతో పాత్రను పోషిస్తుండడం గమనార్హం.