అమ్మలందరికీ అంకితం
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:52 AM
నరసరావుపేట పట్టణంలోని రవికళా మందిర్ థియేటర్‌లో సోమవారం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం నుంచి ‘నాయాల్ది’ అనే తొలిపాట విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్‌రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో...
నరసరావుపేట పట్టణంలోని రవికళా మందిర్ థియేటర్‌లో సోమవారం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం నుంచి ‘నాయాల్ది’ అనే తొలిపాట విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్‌రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అమ్మలకు అంకితం చేస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు మన గురించి ఆలోచించే అమ్మలకు ఇచ్చే గౌవరంగా భావిస్తున్నామన్నారు. రాబోయే 20 సంవత్సరాల వరకు ఈ చిత్రం గుర్తుండిపోతుందన్నారు. దర్శకుడు చిలుకూరి ప్రదీప్ మాట్లాడుతూ ప్రేక్షకుల బావోద్వేగాలకు అనుగుణంగా తీర్చిదిద్దామన్నారు. చిత్రంలో పల్నాడు పౌరుషం కనిపిస్తుందని చెప్పారు. నందమూరి కళ్యాణ్‌రామ్‌కు స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తనయుడు డాక్టర్ చదలవాడ ఆదిత్య కోటప్పకొండ త్రికోటేశ్వరుని చిత్ర పటం అందజేశారు. కార్యక్రమంలో నిర్మాత అశోక్‌వర్ధన్ ముప్పా తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్ (ఆంధ్రజ్యోతి)