Show Time: ఇంటెన్స్ గా 'షో టైమ్' ఫస్ట్ లుక్ 

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:55 PM

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన  చిత్రం  'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి  నిర్మిస్తున్నారు. 

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన  చిత్రం  'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి  నిర్మిస్తున్నారు.   మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం చేస్తున్నారు.  ఉగాది పండుగను సందర్భంగా  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌ చూస్తుంటే  ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

Naveen.jpg

ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కథగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.  నవీన్ చంద్ర గతంలో కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. కామాక్షి భాస్కర్ల కూడా ‘మా ఊరి పోలిమేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Mar 30 , 2025 | 10:55 PM