ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఈవెంట్‌కు సిద్థమవుతోంది
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:02 AM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఈవెంట్‌కు సిద్థమవుతోంది. జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఈవెంట్‌కు సిద్థమవుతోంది. జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో నాట్స్ 8వ తెలుగు సంబరాలు కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్, మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నటీమణులు జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్ర్తి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.