మునుపెన్నడూ చూడని మాస్ లుక్
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:46 AM
కథానుగుణంగా పాత్రలో ఒదిగి అద్భుతంగా భావోద్వేగాలను పలికించగల అరుదైన నటుల్లో కథానాయకుడు నాని ఒకరు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్ - రా స్టేట్‌మెంట్’. ఇప్పటివరకూ...
కథానుగుణంగా పాత్రలో ఒదిగి అద్భుతంగా భావోద్వేగాలను పలికించగల అరుదైన నటుల్లో కథానాయకుడు నాని ఒకరు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్ - రా స్టేట్‌మెంట్’. ఇప్పటివరకూ తెలుగులో రాని విభిన్న కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోందని యూనిట్ తెలిపింది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. థ్రిల్లింగ్ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్న విషయాన్ని తెలుపుతూ బుధవారం నాని కొత్త లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కండలు తిరిగిన దేహం, భుజాన తుపాకితో మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌లో ఆయన ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు