నిధి కోసం సాహసయాత్ర

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:24 AM

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘ఎన్‌సీ24’ అనేది...

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘ఎన్‌సీ24’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. మైథలాజికల్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులకు సంబంధించిన ఓ మేకింగ్‌ వీడియోను టీమ్‌ తాజాగా విడుదల చేసింది. సాహసయాత్ర ఆరంభం అని తెలిపింది. ఇందులో అద్భుతమైన లొకేషన్లను, సినిమా నేపథ్యాన్ని ప్రతిబింబించే సెట్‌ డిజైన్లను, వీఎ్‌ఫఎక్స్‌ హంగుల కోసం సాంకేతిక బృందం చేస్తున్న పనులను చూపించారు. అలాగే, నాగచైతన్య లుక్‌తో సహా కీలక పాత్రల లుక్‌ టెస్ట్‌ స్టిల్స్‌ ఈ వీడియోలో ఉన్నాయి. ఇందులో మునుపెన్నడూ పోషించని పాత్రను నాగచైతన్య పోషిస్తున్నారు. వీడియోను చూస్తుంటే ఆయన నిధి అన్వేషణలో సాగే ఓ సాహసయాత్రికుడిలా కనిపిస్తున్నారు. బాపినీడు సమర్పణలో దర్శకుడు సుకుమార్‌, బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated Date - Apr 27 , 2025 | 01:24 AM