Thandel: ‘తండేల్’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:24 PM
Thandel Trailer: చైతూ, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’ సిరీస్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్న చిత్రం ‘తండేల్’. అనౌన్స్‌మెంట్‌తోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ‘తండేల్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ట్రైలర్ విడుదలయ్యేది ఎప్పుడంటే..
యువ సామ్రాట్ నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా.. చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘తండేల్’. 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ‘తండేల్’ ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, పాటలు అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని వదిలారు.
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
జనవరి 28న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో, అల్యూమినియం బకెట్‌ని వెపన్‌గా పట్టుకొని నాగ చైతన్య, విలన్స్‌పై అటాక్‌కి సిద్ధంగా ఉన్న ఫెరోషిషియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. బకెట్‌పై రక్తపు మరకలను కూడా గమనించవచ్చు. ఇది సినిమాలోని ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌ను ప్రజెంట్ చేస్తోంది. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు, సినిమాలో మంచి యాక్షన్ కూడా ఉంటుందని ఈ పోస్టర్ తెలియజేస్తుంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా టాప్ టెక్నిషీయన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో రాబోతోన్న రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.