Thandel: ‘తండేల్’ థర్డ్ సింగిల్ ఎప్పుడో తెలుసా..
ABN , Publish Date - Jan 21 , 2025 | 10:23 PM
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తీకేయ’ సిరీస్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ చేసి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేశారు. మూడో సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని మంగళవారం వదిలారు. ఆ వివరాల్లోకి వెళితే..
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో టాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలై ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు మూడో పాట విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..
‘తండేల్’ ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సెన్సేషనల్ హిట్‌గా నిలవగా.. రీసెంట్‌గా రిలీజైన సెకండ్ సింగిల్ ‘నమో నమః శివాయ’ సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. ఇక ‘తండేల్’ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ ‘హైలెస్సో హైలెస్సా’ను జనవరి 23న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో సముద్ర తీరంలో రగ్గడ్ లుక్‌లో లవ్లీ స్మైల్‌తో నిలుచుకున్న నాగచైతన్య, ఎదురుగా బ్యూటీఫుల్‌గా డ్యాన్స్ చేస్తూ సాయి పల్లవి కనిపిస్తున్నారు. మేకర్స్ చెబుతున్న ప్రకారం ఈ సాంగ్ లవ్ సాంగ్‌గా ఉంటుందని, ప్రేమికులకు ట్రీట్ ఇచ్చేలా దేవిశ్రీ ఈ పాటను కంపోజ్ చేశారని తెలుస్తోంది.
Also Read- Priyanka Chopra: చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో పూజలు.. ఉపాసనకు థ్యాంక్స్
ఈ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అలాగే మరో నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.