Naari: దిల్ రాజు వదిలిన 'నారి' ట్రైలర్ 

ABN , Publish Date - Feb 22 , 2025 | 03:25 PM

ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా 'నారి'. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు.



ఆమని(Aamani), వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా 'నారి'. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటి పల్లి నిర్మించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ దిల్ రాజు విడుదల చేశారు. (Naari on March 7th)

దిల్ రాజు మాట్లాడుతూ
-  మహిళల గురించి ఒక మంచి కథతో "నారి" సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఆమని గారు మావిచిగురు, శుభలగ్నం లాంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. "నారి" సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్ కు సజెస్ట్ చేస్తున్నా" అని అన్నారు. 




నటి ఆమని మాట్లాడుతూ  "నారి" సినిమా మహిళల గొప్పదనం చెప్పేలా మా దర్శకుడు సూర్య వంటిపల్లి రూపొందించారు. ఈ మూవీలో ఇంతమంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థ్యాంక్స్. ప్రతి మహిళ చూడాల్సిన చిత్రమిది. మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్లు కొద్దిమందే ఉంటారు. ఈరోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ మూవీ. నేను ఈ క్యారెక్టర్ లో ఎంతో ఇన్వాల్వ్ అయి నటించాను" అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "మహిళలకు రక్షణ కావాలి, మహిళల్ని గౌరవించాలి అనే కాన్సెప్ట్ తో "నారి" సినిమాను రూపొందించాను. మా మూవీలో ఒక మహిళ జీవితాన్ని మూడు దశల్లో చూపిస్తున్నాం. 13-20 ఏళ్ల వయసున్న ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు థియేటర్స్ కు తీసుకెళ్లి మా మూవీ చూపించాలని కోరుతున్నా" అన్నారు.  Untitled-3.jpg

Updated Date - Feb 22 , 2025 | 03:25 PM