Mukku Raju Statue Unveiling: ముక్కు రాజు విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:48 AM

నృత్య దర్శకుడు ముక్కు రాజు విగ్రహాన్ని నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆవిష్కరించారు.డ్యాన్సర్స్‌ యూనియన్‌కు 35 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది

హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఏర్పాటుకు కృషి చేసి, ఆరంభంలో డ్యాన్సర్స్‌ యూనియన్‌ ఏర్పాటు చేసిన నృత్య దర్శకుడు ముక్కు రాజు విగ్రహాన్ని నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆవిష్కరించారు. డ్యాన్సర్స్‌ యూనియన్‌ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, భరత్‌ భూషణ్‌, వల్లభనేని అనిల్‌, వీరశంకర్‌, దామోదర ప్రసాద్‌, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్‌ ప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 02:48 AM