అడవిలో మోగ్లీ పోరాటం

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:31 AM

సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో రోషన్‌ కనకాల హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోగ్లీ 2025’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు...

సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో రోషన్‌ కనకాల హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోగ్లీ 2025’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో సాగే ఈ అందమైన ప్రేమకథలో సాక్షి సాగర్‌ మడోల్కర్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ రంపచోడవరం, మారేడుమిల్లి ఫారె్‌స్టలో జరుగుతోంది. సినిమాకు ఆకర్షణగా నిలిచే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నట్లు యూనిట్‌ తెలిపింది. ‘మోగ్లీ 2025’ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ మారుతి ఎం.

Updated Date - Mar 03 , 2025 | 02:31 AM