లాయర్లపై మరింత గౌరవం పెరిగింది

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:06 AM

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రియదర్శి నటించిన తాజా చిత్రం ‘కోర్ట్‌’. ‘ఏ స్టేట్‌ వర్సెస్‌ నోబడీ’ ఉపశీర్షిక. రామ్‌ జగదీశ్‌ దర్శకత్వంలో...

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రియదర్శి నటించిన తాజా చిత్రం ‘కోర్ట్‌’. ‘ఏ స్టేట్‌ వర్సెస్‌ నోబడీ’ ఉపశీర్షిక. రామ్‌ జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నాని సమర్పిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ నెల 14న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ‘‘ప్రేక్షకులకు కొత్తదనం అందించే మంచి సినిమా చేయాలని ఎదురుచూసే సమయంలో దర్శకుడు రామ్‌ ఈ కథను చెప్పారు. సినిమాలో నా పాత్ర కోసం చాలా హోమ్‌ వర్క్‌ చేశాను. ఈ సినిమాతో లాయర్లపై మరింత గౌరవం పెరిగింది. చాలా నిజాయితీతో చేసిన ప్రయత్నం ఈ సినిమా. దర్శకుడు రామ్‌ చాలా ప్రతిభావంతుడు. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని సహజంగా మలిచారు. నానిగారికి ఈ సినిమా కథపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన నటించే సినిమా కన్నా ఈ సినిమా విషయంలోనే ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు. ఈ ఎంగేజింగ్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. అందరికి గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 11 , 2025 | 04:06 AM