అందులో తప్పేముంది?

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:31 AM

మలయాళ చిత్ర కథనాయకుడు మోహన్‌లాల్‌ ఇటీవల శబరిమల లయ్యప్ప క్షేత్రాన్ని సందర్శించారు. తన ఆప్త మిత్రుడు, నటుడు మమ్ముట్టి కోసం ప్రత్యేక పూజలు జరిపించారు. మమ్ముట్ని అసలు పేరు...

మలయాళ చిత్ర కథనాయకుడు మోహన్‌లాల్‌ ఇటీవల శబరిమల లయ్యప్ప క్షేత్రాన్ని సందర్శించారు. తన ఆప్త మిత్రుడు, నటుడు మమ్ముట్టి కోసం ప్రత్యేక పూజలు జరిపించారు. మమ్ముట్ని అసలు పేరు మహమ్మద్‌ కుట్టి కనుక ఆ పేరుతోనే మోహన్‌లాల్‌ పూజలు చేయించడం విమర్శలకు కారణమైంది. అలా ఎలా చేస్తారని చాలా మంది సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. దానిపై ఆయన స్పందిస్తూ అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘మమ్ముట్టి కోసం పూజలు జరిపించడం నా వ్యక్తిగత విషయం. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి ఆయన గురయ్యాడు. ఇప్పుడు బాగానే ఉంది. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని మోహన్‌లాల్‌.

Updated Date - Mar 27 , 2025 | 03:31 AM