బాధపెట్టాను... క్షమించండి

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:14 AM

‘ఎల్‌2: ఎంపురాన్‌’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమైన నేపథ్యంలో కథానాయకుడు మోహన్‌లాల్‌ స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘రాజకీయం, సామాజిక అంశాలు...

‘ఎల్‌2: ఎంపురాన్‌’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమైన నేపథ్యంలో కథానాయకుడు మోహన్‌లాల్‌ స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘రాజకీయం, సామాజిక అంశాలు కొన్ని ‘ఎంపురాన్‌’లో భాగమయ్యాయి. అవి కొందరిని బాధించాయి. నా సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని కించపర్చకుండా చూడటం నటుడిగా నా బాధ్యత. అందుకే నా తరపున, చిత్రబృందం తరపున క్షమాపణలు చెబుతున్నా’ అని అన్నారు. ఇదే అంశంపై చిత్ర నిర్మాత గోకులం గోపాలన్‌ మాట్లాడుతూ ‘సినిమాలో చూపించిన ఏదైనా సన్నివేశం లేదా సంభాషణలు ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే వాటిని వెంటనే తొలగించాలని దర్శకుడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌కు చెప్పా. ఇప్పటికే కొన్ని పదాలను మ్యూట్‌ చేశాం’ అని అన్నారు. కాగా, కేరళ సీఎం పినరయి విజయన్‌ కుటుంబంతో కలసి ‘ఎంపురాన్‌’ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రబృందానికి మద్దతు పలికారు.

Updated Date - Mar 31 , 2025 | 02:14 AM