మొగల్తూరు మారాజులు
ABN , Publish Date - Mar 11 , 2025 | 10:42 AM
మొగల్తూరు కు తెలుగు సినిమా రంగానికి, రాజకీయ రంగానికి ఓ ప్రగాఢ అనుబంధం ఉంది. ఈ ఊరి వారైన కృష్ణంరాజు, చిరంజీవి ఇద్దరూ సినిమా రంగంలోనే కాదు... రాజకీయాల్లోకీ వచ్చి కేంద్రమంత్రులుగా సేవలు అందించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది. ఇద్దరూ పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించిన వారే... కృష్ణంరాజు నిర్మించి నటించిన మనవూరి పాండవులు (Mana Oori Pandavulu) లో ఓ కీలక పాత్రలో నటించారు చిరంజీవి. ఆ తరువాత వారిద్దరూ కలసి ప్రేమతరంగాలు (Prematarangaalu), పులి-బెబ్బులి (Puli - Bebbuli) వంటి చిత్రాల్లోనూ కనిపించారు. వయసులో తనకంటే పెద్దవారయిన కృష్ణంరాజును చిరంజీవి అన్నయ్యా అంటూ అభిమానంగా పిలుస్తారు. కృష్ణంరాజు కూడా తమ్ముడూ అని అభిమానించేవారు. వారిద్దరూ ఒకరి వేడుకల్లో మరొకరు పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు. తరువాత చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో రాజమండ్రి నుండి పార్లమెంట్ కు పోటీ చేసి పరాజయం పాలయ్యారు కృష్ణంరాజు. అయినా వారి అన్నదమ్ముల అనుబంధం కడదాకా సాగింది.
Read Also: Bollywood: ఫస్ట్ ఓకే... సెకండ్ నాట్ ఓకే!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి