Hollywood movie in Telugu: ఆరు రోజులు ముందుగానే
ABN , Publish Date - Apr 26 , 2025 | 02:55 AM
టామ్ క్రూస్ నటించిన ‘ద ఫైనల్ రెకనింగ్’ సినిమా భారత్‌లో ఆరు రోజుల ముందే విడుదల కానుంది.
యాక్షన్ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులను అలరించడానికి హాలీవుడ్ నటుడు టామ్ క్రూస్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’’ సిరీస్ లో భాగమైన ‘ద ఫైనల్ రెకనింగ్ చిత్రం వారం రోజులు ముందుగానే మన దేశంలో విడుదల కానుంది. ఈ సినిమాను వచ్చే నెల 23న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ మొదట ప్రకటించింది. ఇండియాలో ఆరు రోజుల ముందే అంటే మే 17న విడుదల చేస్తున్నట్లు పారామౌంట్ సంస్థ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. మనదేశంలో ఆంగ్ల వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘ద ఫైనల్ రెకనింగ్’ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛేజిల్లో ఎనిమిదోది.