Game Changer: రెండు రోజుల ముందే.. ‘గేమ్ ఛేంజర్’లో ఆ పాట యాడ్ చేశారు

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:30 PM

జనవరి 10న థియేటర్లలోకి వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమాలో ‘నానా హైరానా’ సాంగ్ మిస్ అయిన విషయం తెలిసిందే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ పాట లేకుండానే సినిమా విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పిన మేకర్స్.. తాజాగా ఆ పాటను యాడ్ చేసినట్లుగా తెలిపారు. విషయంలోకి వస్తే..

Game Changer Movie Still

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న భారీ అంచ‌నాల‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో దూసుకెళుతోంది. సంక్రాంతి సంద‌ర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టినట్లుగా చెబుతూ.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే రూ.186 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు ఇందులో ‘నా నా హైరానా’ పాట కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడా పాటను యాడ్ చేసినట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.


సాంకేతిక కారణాల వల్లే ‘నా నా హైరానా’ పాటను జోడించలేకపోయాని చిత్రయూనిట్ విడుదల రోజు క్లారిటీ ఇచ్చింది. అయితే నేటి (జనవరి 12) నుంచి ఈ పాటను థియేటర్లో చూడొచ్చు. సినిమాలో ఈ పాటను యాడ్ చేసినట్టుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాటను ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండనుంది. శ్రేయ ఘోషాల్, కార్తీక్ ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

Also Read-Daaku Maharaaj: అయ్యబాబోయ్.. ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ టాక్ ఇలా ఉందేంటి?


రామ్ చ‌ర‌ణ్ ఇందులో రామ్ నంద‌న్‌, అప్పన్న పాత్ర‌ల్లో ఓ వైపు స్టైలిష్‌గా, మ‌రో వైపు పెర్ఫామెన్స్‌తో అలరించగా, రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, చ‌ర‌ణ్‌-ఎస్‌.జె.సూర్య మ‌ధ్య ఉండే ఎగ్జ‌యిటింగ్ స‌న్నివేశాలకు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రామ్ చరణ్-కియారా కెమిస్ట్రీ, అంజ‌లి నటన మంచి స్పందనను రాబట్టుకుంటోంది. లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌టంలో స్పెష‌లిస్ట్ అయిన శంక‌ర్ త‌న‌దైన పంథాలో గేమ్ చేంజ‌ర్ సినిమాను తెరకెక్కించారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.


Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read- Brahmanandam: హాస్య'బ్రహ్మ'పై దాడి


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 03:31 PM