Mega Star: చిరు... పవన్... మధ్యలో చెర్రీ

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:40 AM

మే మెగా మంత్‌గా మార‌బోతోంది. మెగా ఫ్యాన్స్ కు ఎన్నటికీ మ‌ర‌వ‌లేని మెమోరీస్‌ను తీసుకు రాబోతోంది. అటు తండ్రి, ఇటు బాబాయ్.. మ‌రోవైపు అబ్బాయి.. వ‌రుస స‌ర్‌ప్రైజ్‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేయ‌బోతున్నారు. మెగా ఫ్యాన్స్ కు అస‌లైన పండ‌గ అందించ బోతున్నారు.

మే నెలలో మెగా తుపాన్ రాబోతుంది. మండే ఎండల్లో... మెగాస్టార్ (Maga Star) ఫ్యామిలీ న్యూస్ ఫ్యాన్స్ కు చల్లదనం పంచనున్నాయి. దీంతో మెగా న్యూస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్‌కి మే నెల ఒక బిగ్ బ్లాస్ట్‌ ఫెస్టివల్‌లా మారబోతోంది. ఆ నెలలో ఒకటి కాదు వ‌రుస‌గా పలు సర్‌ప్రైజ్‌లు వెయిట్‌ చేస్తున్నాయ్‌. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఐకానిక్‌ బ్లాక్‌బస్టర్‌ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీ-రిలీజ్ గురించి. ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా మే 9న 2డీ, 3డీ ఫార్మాట్‌లలో థియేటర్స్‌లో సందడి చేయనుంది. 1990 నాటి మూవీ లవర్స్‌తో పాటు చిరు ఫ్యాన్స్‌కి ఈ మూమెంట్‌ సూపర్‌ స్పెషల్‌.


ఇక మే 9వ తేదీనే మరో బిగ్‌ ఈవెంట్ ఉంది. లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌ (Ram Charan) మైనపు ప్రతిమ ఆవిష్కరణ జరగబోతోంది. చెర్రీ తన ఫ్యామిలీతో కలిసి ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నాడు. ఇది ఫ్యాన్స్‌కి లైఫ్‌టైమ్‌ మెమరీ అని చెప్పొచ్చు. అందుకే చరణ్‌ ఫ్యాన్స్‌ దీన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. అంతే కాదు, రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో 'ట్రిపుల్ ఆర్' లైవ్‌ ఆర్కెస్ట్రా పెర్ఫార్మెన్స్‌కి కూడా చరణ్‌ వెళ్తున్నాడు. ఇది ఫ్యాన్స్‌కి డబుల్‌ ధమాకా అనే చెప్పాలి. ఇటు తమ హీరో క్రియేట్ చేసిన ఈ ఘనత పట్ల మెగా ఫ్యాన్స్ ఆనందంతో మురిసిపోతున్నారు.

మరోవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) కూడా మే నెలను హీటెక్కించబోతున్నాడు. 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ని మేలో పూర్తి చేసి, డబ్బింగ్‌ కూడా స్టార్ట్‌ చేయనున్నాడట. అదే సమయంలో, ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా షూటింగ్‌ కూడా మే లోనే మొదలవబోతోంది. మొత్తంగా, 2025 మే నెల చిరంజీవి సినిమా రీ-రిలీజ్‌, రామ్‌ చరణ్‌ మైనపు ప్రతిమ ఆవిష్కరణ, పవన్‌ కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌లతో మెగా ఫ్యాన్స్‌కి ఫుల్‌ జోష్‌ నెలగా మారబోతోంది.

Also Read: The Family Man 3: వాటర్ ఫాల్స్ లో పడి నటుడి మృతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 29 , 2025 | 11:48 AM