Manchu Vishnu: ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటో చెప్పబోతున్నాం..

ABN , Publish Date - Jan 19 , 2025 | 08:25 AM

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. బెంగళూర్ మొట్టమొదటి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Manchu Vishnu

శివుని ఆజ్ఞతోనే ‘కన్నప్ప’ చిత్రం రూపుదిద్దుకుంటోందని అన్నారు హీరో మంచు విష్ణు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. 25, ఏప్రిల్ 2025న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించి.. బెంగళూరులో గ్రాండ్‌గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Also Read- Ram Charan: రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు.. కాదు కాదు అంతకుమించి!


ఈ కార్యక్రమంలో హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. మా ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌ను కన్నడ నేల నుంచి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మొదటిసారి కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ తరువాత శివ రాజ్ కుమార్ కూడా చేశారు. తెలుగులో బాపు రమణ దర్శకత్వంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్పగా చేశారు. మళ్లీ ఇప్పుడు మేం కన్నప్ప కథను చెప్పబోతున్నాం. ఈ తరానికి కన్నప్ప ఎవరు? ఆయన కథ ఏంటి? ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి? అని క్లియర్‌గా చూపించాలని, చెప్పాలనే ఈ కన్నప్ప సినిమాను చేస్తున్నాం. ముఖేష్ కుమార్ సింగ్ బుల్లితెరపై ఓ లెజెండ్. మహాభారతం సీరియల్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియా నుంచి టీంను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లాం. ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్లను తీసుకొచ్చాం. శరత్ కుమార్ సెట్‌కి ఆన్ టైంకి వచ్చేవారు. ప్రభుదేవా అన్న అడిగిన వెంటనే మా ప్రాజెక్ట్ కోసం వచ్చారు. అసలు ఈ కథను అనుకున్నప్పుడు రాక్ లైన్ వెంకటేష్‌కే ఫోన్ చేసి చెప్పాను. అద్భుతంగా ఉంటుంది.. గో హెడ్ అని ధైర్యాన్నిచ్చారు. ఆ శివుని ఆజ్ఞతోనే ఈ చిత్రం ప్రారంభమైందని నాకు అనిపిస్తుంది. ఈ కన్నప్ప నాకెంతో ప్రత్యేకం. ఆర్ఆర్ పూర్తవ్వక ముందే రాక్ లైన్ వెంకటేష్ ఈ మూవీని చూశారు. అద్భుతంగా వచ్చిందని భరోసానిచ్చారు. ఇక ఆ శివుని ఆశీస్సులతో ఏప్రిల్ 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నామని తెలిపారు.


‘‘ముఖేష్ కుమార్ సింగ్ మహాభారతం సీరియల్ తీశారు. ఇప్పుడాయన శివ భక్తుడిలా మారిపోయారు. ఆయన ప్రతీ గుడికి వెళ్తుంటారు. కన్నప్ప చిత్రాన్ని అద్భుతంగా తీశారు. మోహన్ బాబు సార్, విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. నేను ఈ చిత్రం కోసం మూడు సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాను. స్టీఫెన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’నని ప్రభు దేవా తెలపగా.. ‘‘కన్నప్ప అంటే శివ భక్తుడు అని అందరికీ తెలిసిందే. కానీ కన్నప్ప గురించి తెలియని ఎన్నో విశేషాల్ని ఇందులో చూపించబోతున్నారు. న్యూజిలాండ్‌లో ఎంతో అద్భుతంగా, సరదాగా షూటింగ్ చేశాం. నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ను ఈ చిత్రంలో చూపిస్తాం.. ఎవరు నాస్తికులు.. ఎవరు ఆస్తికులు అనేది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది’’ అని అన్నారు సీనియర్ నటుడు శరత్ కుమార్.

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!


Kannappa.jpg

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘కన్నడలో రాజ్ కుమార్ మొదటగా కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ సినిమా చూసిన తరువాత కన్నప్ప సినిమాను మళ్లీ చేయడం, ఆ పాత్రను మళ్లీ రీక్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ నాకు అద్భుతమైన నటీనటులు దొరికారు. సినిమాకు గొప్ప ఆర్టిస్టులంతా కలిసి వచ్చారు. వారంతా అద్భుతంగా నటించారు. విష్ణు, మోహన్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుంది’’ అని తెలపగా.. ‘‘కన్నప్ప చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ రాక్ లైన్ వెంకటేశ్.


Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

Also Read:Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 08:25 AM