Emotional Moment: భావోద్వేగానికి గురైన మంచు లక్ష్మి
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:39 PM
మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ ఛేంజ్' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల, తన తమ్ముడు మంచు మనోజ్‌తో కలసి ఆసక్తికరమైన సంఘటనను ఎదుర్కొని భావోద్వేగానికి గురైన మంచు లక్ష్మి
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన బోధన అందించే లక్ష్యంతో నటి మంచు లక్ష్మి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ ఏడాదీ హైదరాబాద్‌లో సెలబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నారు. తాజాగా, నోవాటెల్ హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంచు మనోజ్, తన సతీమణి మౌనికతో విచ్చేసి మంచు లక్ష్మీని ఆశ్చర్యపరిచారు. చాలా రోజుల తర్వాత తన తమ్ముడిని చూసిన ఆనందంలో ఆమె, భావోద్వేగంతో మనోజ్‌ను హత్తుకున్నారు. కంటనీరు పెట్టుకున్న మంచు లక్ష్మిని మౌనిక ఓదార్చారు.