బ్యాక్‌ టు హైదరాబాద్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 02:36 AM

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం రెండో షెడ్యూల్‌ పూర్తయింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న...

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం రెండో షెడ్యూల్‌ పూర్తయింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. పదిహేను రోజులుగా ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సేల్‌, బాల్డ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మంగళవారం రాత్రితో షెడ్యూల్‌ పూర్తి కావడంతో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. యాక్షన్‌ అడ్వెంచర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి.

Updated Date - Mar 20 , 2025 | 02:36 AM