Maha Kumbhamela: మొన్న బాలకృష్ణ సినిమా... రేపు తమన్నా మూవీ

ABN , Publish Date - Feb 19 , 2025 | 07:00 PM

తెలుగు సినిమా రంగంలో తెరకెక్కుతున్న రెండు సీక్వెల్ మూవీస్ ఇప్పుడు మహా కుంభమేళను భలే ఉపయోగించుకున్నాయి. అందులో ఒకటి 'అఖండ -2' కాగా మరొకటి 'ఓదెల -2'!

తెలుగు చిత్రసీమలో తెరకెక్కుతున్న సినిమాలకు మహా కుంభమేళా చక్కని వేదికగా మారింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న 'అఖండ -2' (Akhanda -2) సినిమా షూటింగ్ దాదాపు వారం రోజుల పాటు మహా కుంభమేళలో జరిగింది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అక్కడ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. ఇప్పుడు తమన్నా భాటియా (Tamannaah Bhatia) నాయికగా రూపుదిద్దుకున్న 'ఓదెల -2' (Odela -2) సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ కు మహా కుంభమేళ వేదిక కాబోతోంది. తమన్నా నటించిన హైలీ యాంటిసిసేటెడ్ మూవీ 'ఓదెల -2'ను అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్ తో కలిసి డి. మధు నిర్మిస్తున్నారు. ఇది 2021లో ఓటీటీలో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్. ఇందులో నాగ సాధు పాత్రను తమన్నా పోషించింది. ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 22న కాశీ మహా కుంభమేళలో లాంచ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. అక్కడ లాంచ్ అవుతున్న తొలి టీజర్ తమదే నని వారు చెప్పారు. ఈ సందర్భంగా కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో సాగసాధుగా తమన్నా ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగమహేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ లోక్ నాథ్ సంగీతం అందిస్తు్న్నాడు.

Updated Date - Feb 19 , 2025 | 07:00 PM