Madhuram Telugu Movie: అందరికీ కనెక్ట్‌ అవుతుంది

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:34 AM

ఉదయ్‌రాజ్‌ హీరోగా నటించిన ‘మధురం’ చిత్రంలో బాల్య ప్రేమకథను ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినదని తెలిపారు

ఉదయ్‌రాజ్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘మధురం’. వైష్ణవి సింగ్‌ కథానాయిక. రాజేశ్‌ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు ఉదయ్‌. ‘‘మెగాస్టార్‌ చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఇది పాఠశాలలో మొదలయ్యే అందమైన ప్రేమకథ. సినిమా చూసిన ప్రేక్షకులందరికీ వారి బాల్యాన్ని గుర్తుకుతెస్తుంది. ఇందులోని పాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది’’ అని చెప్పారు.

Updated Date - Apr 18 , 2025 | 12:35 AM