Mad Movie Team: నవ్వించడంలో విజయం సాధించాం

ABN , Publish Date - Mar 29 , 2025 | 03:54 AM

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం సూపర్ హిట్‌ టాక్‌ను సంపాదించి, భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంటోంది. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌, నిర్మాత హారిక సూర్యదేవర, మరియు నాగవంశీ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు

నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌లో నాగవంశీ మాట్లాడుతూ ‘మా చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. భారీ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. ప్రేక్షకులను నవ్వించడంలో విజయం సాధించాం. మాపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘సినిమాలో సునీల్‌ పాత్రకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ ‘మా కష్టానికి ఫలితం దక్కడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 03:55 AM