ఆసక్తిగా ఎదురుచూస్తున్నా

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:08 AM

సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ నెల 22న హైదరాబాద్‌ హైటెక్స్‌లో ‘నా టూర్‌ ఎమ్‌.ఎమ్‌.కే’ అనే సంగీత ప్రదర్శనను నిర్వహించనున్న సంగతి విదితమే. ఈ సంగీతం ప్రదర్శన కోసం...

ఎస్‌.ఎ్‌స.రాజమౌళి

సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ నెల 22న హైదరాబాద్‌ హైటెక్స్‌లో ‘నా టూర్‌ ఎమ్‌.ఎమ్‌.కే’ అనే సంగీత ప్రదర్శనను నిర్వహించనున్న సంగతి విదితమే. ఈ సంగీతం ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎ్‌స.రాజమౌళి ఎక్స్‌ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో తెలిపారు. ‘‘అన్నయ్య కీరవాణి నిర్వహించనున్న సంగీత ప్రదర్శన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ కచేరిలో చాలా మంది గాయకులు అన్నయ్య సంగీతం అందించిన సినిమాల్లోని పాటలతో అలరించనున్నారు. ఇందులో నా సినిమాల్లోని సూపర్‌ హిట్‌ పాటలు కూడా ఉన్నాయి. నా కోరిక ఏంటంటే అన్నయ్య కీరవాణి సినిమాల్లోని ఓఎ్‌సటీలను కూడా ప్రదర్శించాలని. అలాగే ఆయన లైవ్‌లో పాడాలని డిమాండ్‌ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2025 | 04:08 AM