Vishwaksen: ‘లైలా’ నుంచి నెక్ట్స్ అటాక్.. ‘పటక్’
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:42 PM
ట్రైలర్ బయటకు వచ్చింది కాబట్టి.. నాకంటే ట్రైలర్ ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుతానని అన్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన ‘లైలా’ చిత్ర ట్రైలర్‌ని గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ విడుదల చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం స్పెషల్‌గా థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ క్రేజ్‌ని పెంచగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ని హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఏ మాల్‌లో గ్రాండియర్‌గా విడుదల చేశారు.
Also Read-Allu Aravind: రామ్ చరణ్ ‘చిరుత’పై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్
ఈ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘లైలా’ ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థియేటర్లలో మీరు నవ్వి నవ్వి మీ ఛాతి చపాతీ కావాలని డిసైడ్ అయ్యాం. కచ్చితంగా ‘లైలా’ మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. ట్రైలర్ బయటకు వచ్చింది కాబట్టి.. నాకంటే ట్రైలర్ ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుతా. లైలా నుంచి నెక్ట్స్ అటాక్ ‘పటక్’ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ నేనే రాశా. ఆ సాంగ్ కూడా అందరికీ నచ్చుతుంది. ఫిబ్రవరి 14న అందరం థియేటర్లలో కలుద్దామని అన్నారు.
‘లైలా’ ట్రైలర్ విషయానికి వస్తే.. లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న సోనూ మోడల్(విశ్వక్ సేన్) అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే విషయంలో ఏదో గొడవకు దిగినట్లు అర్థమవుతుంది. దీంతో ఎమ్మెల్యే మనుషులు అతడు దొరికితే చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితిలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి సోనూ లైలాగా అవతారం మారుస్తాడు. ‘లైలా’గా లేడీ గెటప్‌లోకి మారిన విశ్వక్‌కు ఎదురైన సంఘటనలు ఏంటి? ఎమ్మెల్యేతో గొడవకు, సోనూకి సంబంధం ఏంటి? అనే విషయాలు సినిమాలో ఆసక్తికరంగా ఉండనున్నాయి. సోను మోడల్ పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్.. అతడు చేసే కామెడీ వేరే లెవల్ అన్నట్లుగా ఈ ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ట్రైలర్ మొత్తం యూత్‌ని ఆకర్షించే డైలాగ్‌లతో నింపారు. ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా ఉండటమే కాకుండా.. లేడీ పాత్రలో విశ్వక్ సేన్ చేసే అల్లరి థియేటర్లలో ప్రేక్షకులను పడిపడి నవ్వేలా చేస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ షోతో యూత్ ఆడియెన్స్‌కు వెల్‌కమ్ చెబుతున్నట్లుగా ఉంది. మొత్తంగా అయితే ప్రేమికుల రోజున ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందనేది మాత్రం ఈ ట్రైలర్ తెలియజేస్తుంది.