విలన్ వస్తున్నాడు
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:33 AM
మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే...
మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిదంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని ఖండిస్తూ చిత్రబృందం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ముందు ప్రకటించిన విధంగా ఈ నెల 27న ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అందులో తెలిపింది. ‘సరైన సమయమిది. అందరూ జాగ్రత్తగా ఉండండి. విలన్ మీ కోసం వచ్చేస్తున్నాడు’ అంటూ పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.