Indian Mythology Film: కొరగజ్జ దేవత కథ
ABN , Publish Date - Apr 25 , 2025 | 06:21 AM
కొరగజ్జ దేవత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి సంగీత దర్శకుడు గోపీసుందర్ ఆరు పాటలు స్వరపరిచారు. దర్శకుడు సుధీర్ అత్తవర్ ఈ చిత్రంలో నాటి ఆచారాలు, సంప్రదాయాలను అర్థం చేసుకొని పాడించిన పాటలకు సాహిత్యం అందించారు
కర్నాటక, కేరళలోని కరావళి ప్రాంతాల్లో, ముంబైలోని కొన్ని ప్రదేశాల్లో పూజలు అందుకొనే ప్రధాన దేవత కొరగజ్జ కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కొరగజ్జ’. సుధీర్ అత్తవర్ దర్శకుడు. నాటి ఆచారాలు, సంప్రదాయాలను అర్థం చేసుకుని, కొంత పరిశోధన చేసి ఈ చిత్రానికి పాటలు స్వరపరిచారు సంగీత దర్శకుడు గోపీసుందర్. సినిమాలో ఆరు పాటలు ఉంటాయనీ, వాటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ పాటలకు దర్శకుడు సుధీర్ అత్తవర్ సాహిత్యాన్ని అందించారు.