దీక్ష, పట్టుదలతో..
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:54 AM
కిరణ్, అలేఖ్యరెడ్డి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘దీక్ష’. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించడంతో పాటు పి.అశోక్ కుమార్‌తో కలిసి నిర్మిస్తున్నారు....
కిరణ్, అలేఖ్యరెడ్డి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘దీక్ష’. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించడంతో పాటు పి.అశోక్ కుమార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ప్రేమ, వినోదం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్‌ను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. హీరో కిరణ్ భీముని పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆర్‌ఆర్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి’ అని అన్నారు. ఆక్సఖాన్, తులసి, అనూష, కీర్తన తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.