ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుంది

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:45 AM

క సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం దిల్‌రుబా. విశ్వకరుణ్‌ దర్శకత్వంలో రవి, జోజో జోస్‌, రాకే్‌షరెడ్డి.. సారెగమ సంస్థతో కలసి నిర్మించారు..

Dilruba Movie

‘క’ సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం ‘దిల్‌రుబా’. విశ్వకరుణ్‌ దర్శకత్వంలో రవి, జోజో జోస్‌, రాకే్‌షరెడ్డి... సారెగమ సంస్థతో కలసి నిర్మించారు. ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇందులో సిద్ధు అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్రను విశ్వకరుణ్‌ చాలా కొత్తగా తీర్చిదిద్దారు. ఇదో న్యూ ఏజ్‌ కమర్షియల్‌ సినిమా. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది. మహిళలను గౌరవించాలనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది. దర్శకుడు సినిమాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎక్కడా బోర్‌ కొట్టదు. విజయంపై టీమ్‌ అంతా నమ్మకంతో ఉంది. మంచి సినిమా చూశామనే సంతృప్తితో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. సినిమాలో సిద్ధు ఏ సందర్భంలోనూ ‘సారీ’, ‘థ్యాంక్స్‌’ చెప్పడు. దానికి కారణం ఏమిటనేది ఆసక్తికరంగా ఉంటుంది. లవ్‌ ట్రాక్‌, సంభాషణలు, సంగీతం ఈ సినిమాకు ప్రధానాకర్షణ. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.

For AndhraPradesh News And Telugu News


Also Read: Devotional Thriller: షణ్ముఖ అందరికీ నచ్చుతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 12 , 2025 | 11:14 AM